Beerla Ilaiah: రైతులకు బేడీలు వేసిన నాయకుల నుంచి తాము నేర్చుకోవాలా?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLAs)లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-12-16 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLAs)లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ(Telangana Assembly)లో మాట్లాడారు. రాష్ట్ర టూరిజంపై చర్చ పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్(BRS) తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. బీఏసీ కమిటీ(BAC Committee)లో చర్చ జరుపకుండా పారిపోయారని సెటైర్ వేశారు. కనీసం సభాపతికి కూడా మర్యాద ఇవ్వడం లేదని సీరియస్ అయ్యారు. తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏనాడూ రైతులకు న్యాయం చేయలేదని గుర్తుచేశారు.

రైతుల చేతులకు బేడీలు వేసిన నాయకుల నుంచి తాము నేర్చుకోవాలా? మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు అందరూ సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీలో జరుగుతున్న బీఏసీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సభ ఎన్నిరోజులు నడుపుతారు అనేదానిపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇవ్వకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్‌ రావు(Harish Rao) వెల్లడించారు. వీరితో పాటుగా MIM నేతలు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

Tags:    

Similar News