ట్విట్టర్ టిల్లు ఉలిక్కి పడ్డాడు! కేటీఆర్‌పై మరోసారి కాంగ్రెస్ శ్రేణుల విమర్శలు

ట్విట్టర్ టిల్లు ఉలిక్కిపడ్డారని కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను తీవ్ర విమర్శలు గుప్పించారు. బొగ్గు గనుల వేలంపై మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-21 08:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ట్విట్టర్ టిల్లు ఉలిక్కిపడ్డారని కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను తీవ్ర విమర్శలు గుప్పించారు. బొగ్గు గనుల వేలంపై మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శించిన సంగతి తెలిసిందే. సింగరేణి వేలం పాటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఎందుకు మాయమైందన్నారు. 2021 డిసెంబర్ 11 నాడు కోల్ బ్లాక్ కేటాయించండని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తుచేశారు. నేడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వేలం పాటలో పాల్గొంటారనే మాట చెబుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రక్షణ కవచం అని ఊరికే అనడం లేదని, తొమ్మిదేళ్లకు పైగా కేంద్రం తమ మెడపై కత్తిపెట్టిన బొగ్గు గనుల వేలం కాకుండా చూసుకున్నామని అన్నారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి.

ట్విట్టర్ టిల్లు ఉలిక్కి పడ్డారని విమర్శించారు. ‘సింగరేణిని ఫణంగా పెట్టి తనకు అనుయాయులైన రెండు కంపెనీలకు బొగ్గు గనులను కేసీఆర్ ధారాదత్తం చేశాడా? లేదా, టిల్లు సమాధానం చెప్పాలి. “2022 అక్టోబర్ లో జరిగిన వేలంలో కోయగూడెం బ్లాక్ ను అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్”(ఇది కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన అరబిందో సంస్థకు చెందినది) “2023 ఆగస్టులో జరిగిన వేలంలో సత్తుపల్లి బ్లాక్ ను శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ దక్కించుకున్నాయి” (ఇది కేసీఆర్ కు బంధువైన ప్రతిమ శ్రీనివాస్ కు చెందినది) దీని వెనుక గూడుపుఠాణి ఏంటి’ అని సోషల్ మీడయా వేదికగా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

Tags:    

Similar News