పోలీస్ స్టేషన్లో కింద పడుకొని కాంగ్రెస్ నేత వీహెచ్ నిరసన

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

Update: 2023-04-04 15:45 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వీహెచ్ కింద పడుకొని నిరసన వ్యక్తం చేశారు. తాము తెచ్చిన అంబేద్కర్ విగ్రహాన్నే పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని వీహెచ్ కోరగా.. అందుకు పోలీసులు అనుమతినివ్వలేదు. ఈ క్రమంలోనే పోలీసులకు వీహెచ్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వీహెచ్ ను బలవంతంగా కారులోకి ఎక్కించి అంబర్ పేట్ లోని ఆయన ఇంటికి తరలించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..