మోడీని కలుస్తా.. చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తా.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-07 11:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే కులగణన బిల్లును ఆమోదించాలని అన్నారు. ఈ విషయాన్ని తాను ఇక్కడితోనే వదిలిపెట్టబోను అని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి కులగణన చేపట్టాలని కోరుతా అని కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా ఇంకా బీసీలకు న్యాయం జరుగడం లేదని అన్నారు. బిహార్‌లో నితీష్ కులగణన చేస్తే 67 శాతం రిజర్వేషన్ బీసీలకు వచ్చిందన్నారు.

రాహుల్ గాంధీ చేసిన ఆలోచనను మోడీ కొనసాగించాలని కోరారు. ఓబీసీ కన్వీనర్‌గా తాను ఉండి రిజర్వేషన్ పెంచాలని మోడీని గతంలో కోరానని గుర్తుచేశారు. ఐఐటీలో కూడా రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని.. బిల్ పాస్ అయిందని తెలిపారు. కానీ బీసీలు చట్ట సభల్లో డబుల్ డిజిట్ కూడా దాటడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నితీష్, చంద్రబాబులు కూడా అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని మోడీని కోరాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్న బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణలో కులగణన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే.. బీసీలకు మేలు జరుగుతుందని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

Tags:    

Similar News