మంత్రి పువ్వాడ అజయ్ ఏమైనా పుడింగా.. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ ఏమైనా పుడింగా అని ప్రశ్నించారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ ఏమైనా పుడింగా అని ప్రశ్నించారు. శనివారం ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు మాట్లాడారు. పువ్వాడ అజయ్ ను ఓడిస్తానని చెప్పారు కదా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన శ్రీనివాస్ రెడ్డి పువ్వాడపై విరుచుకుపడ్డారు. పువ్వాడ అజయ్ ను ఓడించడానికి తాను పోటీ చేయాల్సిన అవసరం లేదని, ఓ బచ్చాగాడిని పెట్టి ఓడిస్తామని చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటును తాకనీయబోమని మరోసారి స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ ను ఓడించడానికి ఎలాంటి డబ్బు అవసరం లేదని, ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పారు. ఇక తాను ఖమ్మం జిల్లాలోనే పోటీ చేయనున్నాని చెప్పిన పొంగులేటి... ముందుగా ఏ ఎన్నికలు వస్తే వాటికే పోటీ చేస్తానని చెప్పారు.