‘ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే అందుబాటులో ఉండవా?’
ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే అందుబాటులో ఉండవా? అంటూ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ సీనియర్ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే అందుబాటులో ఉండవా? అంటూ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ సీనియర్ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించే ఛాన్స్‌ను కోల్పోయావంటూ ఆదివారం ఆయన ఓ ప్రకటనలో ఫైర్అయ్యారు. సింగరేణి ప్రైవేటీకరణపై బీజేపీని ఎందుకు? ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్‌లు ఇద్దరూ మోసగాళ్లేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందన్నారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన అంశాల గురించి మాట్లాడే పరిస్థితి బీఆర్‌ఎస్‌లో లేదన్నారు. పీఎం, సీఎంలు కలసి తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని విమర్శించారు.
ఇక ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడడం ఏమిటో? అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత మోడీ మాట్లాడారని పది మంది మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారన్నారు. రాజకీయ విమర్శలు చేస్తూ డెవలప్మెంట్ను పక్కన పెట్టడం సరికాదన్నారు. మోడీని రాష్ట్ర సర్కార్ గట్టిగా నిలదీయాల్సింది పోయి మౌనంగా ఉండటం విచిత్రంగా ఉన్నదన్నారు. వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి జరిగిదంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ, వాటిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందన్నారు.
దీంతో బీజేపీ ఆరోపణలను ప్రజలను నమ్మే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ నుంచి మోడీ వరకు అందరూ మాట్లాడుతున్నా.. చర్యలు మాత్రం లేవన్నారు. దీని బట్టి రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు కుదిరినట్లు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఇనుము పరిశ్రమ, సాగునీటి ప్రాజెక్టు జాతీయ హోదా లాంటి పనులు ఎందుకు? ముందుకు పోలేదన్నారు. మియపూర్ భూములు, నయీమ్ భూముల ఆస్తులు, ప్రభుత్వ భూముల అమ్మకాల్లో అక్రమాలు, కాళేశ్వరం అవినీతి, మిషన్ భగీరథ అవినీతి లపై విచారణలను ఎటు? వెళ్లాయని మండిపడ్డారు.
Also Read..