‘బీఆర్ఎస్ నేతలకు మైండ్ పనిచేయడం లేదు’
కేసీఆర్ కుటుంబం తొమ్మిదేళ్లలో వేల కోట్లు సంపాదించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కుటుంబం తొమ్మిదేళ్లలో వేల కోట్లు సంపాదించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాలనలో సామాజిక న్యాయమెక్కడా? అంటూ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ యూత్డిక్లరేషన్సక్సెస్కావడంతోనే బీఆర్ఎస్ నేతలకు మైండ్ పనిచేయడం లేదన్నారు. ప్రియాంక త్యాగాల కుటుంబం నుంచి వచ్చిందని, ఆమెపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కేసీఆర్హామీలన్నింటికి తూట్లు పడ్డాయన్నారు. కుటుంబ పాలనలో అంతా విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఒకశాతం కూడా లేని సామాజికవర్గంలో అంత మంది మంత్రులు ఎలా? అయ్యారంటూ మండిపడ్డారు. అమరవీరుల ఆంక్షలపై నీరు చల్లి కేసీఆర్ ఫ్యామిలీ కాలం ఎల్లదీస్తుందన్నారు. కేసీఆర్పని ఖతమేనని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం అన్నారు. ప్రభుత్వంలో ఉండి చేసిన అవినీతిని అంతా కక్కిస్తాం అంటూ మహేష్గౌడ్హెచ్చరించారు.