రూ.36 వేల కోట్లతో విద్యుత్ కొనడం ఏంటీ?: కాంగ్రెస్ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్
ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను అమ్మే స్థాయిలో ఉన్నామని సీఎం పదే పదే చెబుతుండగా రూ.36 వేల కోట్లతో విద్యుత్ కొనడం ఏంటని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను అమ్మే స్థాయిలో ఉన్నామని సీఎం పదే పదే చెబుతుండగా రూ.36 వేల కోట్లతో విద్యుత్ కొనడం ఏంటని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ దోపిడీ జరుగుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2 వేల మెగావాట్ల విద్యుత్ ను ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు.
ప్రైవేట్ సంస్థల నుంచి కమీషన్లు పొందుతున్నదని ఆరోపించారు. ఉచిత పవర్ కాంగ్రెస్ హయాంలోనే సమర్థవంతంగా వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇదంతా పవర్ డిపార్ట్ మెంట్ అధికారులకు తెలుసునని చెప్పారు. రైతు డిక్లరేషన్ కోసం పనిచేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారమని పేర్కొన్నారు.