కాళేశ్వరం అవినీతిపై విచారణకు కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

కాంగ్రెస్ అధికారంలో లేనప్పడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చాలా సందర్భాల్లో మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Update: 2024-01-07 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ అధికారంలో లేనప్పడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చాలా సందర్భాల్లో మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ అంటే కాలయాపన చేసే యోచనగా కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఇచ్చిన అన్ని హామీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి తప్పకుండా వస్తాయని డీకే అరుణ పేర్కొ్న్నారు.

Tags:    

Similar News