రైతులు తిరగబడతారని కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది: హరీష్ రావు

రైతులు ఎక్కడ తిరగబడతారో అని.. మంత్రుల పర్యటనల్లో భారీగా పోలీసులను మోహరించి ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.

Update: 2025-01-05 16:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు ఎక్కడ తిరగబడతారో అని.. మంత్రుల పర్యటనల్లో భారీగా పోలీసులను మోహరించి ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. హన్మకొండ బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS party) కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డిని, ఇతర నాయకులను నిర్భంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతు భరోసా పేరిట కాంగ్రెస్ చేసిన మోసం పై వరంగల్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసి రిప్రజెంటేషన్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. ఎకరాకు రూ.7,500 ఇస్తామని చెప్పి మాట తప్పిన మీ తీరును చూసి యావత్ తెలంగాణ రైతాంగం చీదిరించుకుంటున్నదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎక్కడిక్కడ నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. రైతు భరోసా పేరుతో ఎకరాలకు 15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 12 వేలు ఇస్తామని ప్రకటించి రైతులకు ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.


Similar News