నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచింది: కాశం వెంకటేశ్వర్లు

రాష్టంలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు లేక విద్యార్థులు, యువతలో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు చెప్పారు.

Update: 2024-07-01 16:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు లేక విద్యార్థులు, యువతలో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు చెప్పారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశం కల్పిస్తామని, నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగ యువకులకు హామీలు ఇచ్చి కాళ్ళ వెళ్ళా పడి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయిందన్నారు. మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ పేరుతో సరూర్ నగర్ సమావేశంలో ప్రకటించారని, చిక్కడపల్లి లైబ్రరీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ప్రచారం చేశారాని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పి మోసం చేసారని ధ్వజమెత్తారు.మెగా డీఎస్పీ వేస్తామని కేవలం పదకొండు వేల పోస్టులను మాత్రమే పిలిచారని తెలిపారు.నిరుద్యోగులను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట మంచిదన్నారు.

నిరుద్యోగులను చదువుకునే అవకాశం సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్లు ప్రకటించి వారిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జూలై ఆగస్టు లో దాదాపు పదిహేను నోటిఫికేషన్లు ప్రకటించారని , టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పి ఏం చేయలేదన్నారు. అరెస్ట్ అయినా యువతకు హాస్పిటల్‌లో వైద్య సేవలు కూడా అందించకుండా చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కోసం దీక్షకు కూర్చున్న మోతిలాల్ నాయక్ దీక్ష విరమించాలని బీజేపీ తరపున కోరుతున్నామని చెప్పారు. పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పి ఇంతవరకు దాని సంగతి తేల్చ లేదన్నారు. యూనివర్సిటీ హాస్టల్ లో ఎలాంటి కనీస సదుపాయాలు లేవని , వారు మాత్రం కొత్త కొత్త భవంతులు కట్టుకుని ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ తరపున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Similar News