మునుగోడుపై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్.. నేడు హైదరాబాద్‌కు కీలక నేత

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని వీడి బీజేపీ

Update: 2022-08-10 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నికను సృష్టించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల కంటే ముందే మునుగోడులో బహిరంగ సభ నిర్వహించి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత లాభాల కోసమే పార్టీ మారాడని నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. అంతేగాక, రాష్ట్రంలోని కీలక నేతలతో ఓ కమిటీ వేసి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి దూకుడు పెంచింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ నాయకత్వంలో పనిచేయలేనని తేల్చి చెప్పడంతో రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్‌కు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ రానున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌ వేదికగా మునుగోడు ఉప ఎన్నికపై ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్


Similar News