కాంగ్రెస్ వచ్చింది.. మార్పు తెచ్చింది! శివరాత్రి పర్వదినాన నీళ్లు లేని గోదావరి!

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-03-09 12:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో నీళ్లకు కరువు ఏర్పడిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శనివారం ఆసక్తికర పోస్ట్ చేసింది.

కాంగ్రెస్ వచ్చింది.. మార్పు తెచ్చింది.. అని సెటైర్లు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓ ఫోటో పోస్ట్ చేసింది. గత ఏడాది శివరాత్రి రోజు నిండుకుండలా గోదావరి నది ఉందని, నేడు వేల క్యూసెక్కుల నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేస్తుండడంతో నీళ్లు లేక గోదావరి బోసిపోయినదని ఫోటో విడుదల చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News