కాంగ్రెస్ 420 బుక్ లెట్ విడుదల.. హస్తం పార్టీ కీలక నిర్ణయం
కాంగ్రెస్ 420 బుక్ లెట్ విడుదలపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జీ. నిరంజన్ ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ 420 బుక్ లెట్ విడుదలపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జీ. నిరంజన్ ఫైర్ అయ్యారు. 139 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో చేతి గుర్తుపై 420 అని ముద్రించినందుకు BRS పార్టీ మరియు దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనుందన్నారు. BRS పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ECని కోరుతామన్నారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న కాంగ్రెస్ పార్టీని నిందించడానికి ఒక బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
చేతి గుర్తుపై 420 అని ముద్రించడం అభ్యంతరకరం మరియు శిక్షార్హమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీపై అవమానకరమైన మరియు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 24 నవంబర్ 2023న EC కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిందన్నారు. ఆ నోటీసు లో అనుమతులను రద్దు చేసే అధికారాలు తమకు ఉన్నాయని EC గుర్తు చేసిందన్నారు. 139 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో చేతి గుర్తుపై 420 అని ముద్రించినందుకు కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తుందన్నారు.