సస్పెండ్ చెయ్యరు.. మైక్ ఇవ్వరు ఇది కరెక్ట్ కాదు.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.

Update: 2024-08-01 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయినప్పటికి స్పీకర్ తమను పట్టించుకోవడం లేదని, అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సభలో ఎస్సీ వర్గీకరణ తీర్పుపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ను కోరగా.. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడాలని సభ్యులను సూచించారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. నిన్నటి సభలో సబితా ఇంద్రారెడ్డి పేరు తీసుకువచ్చారు కాబట్టి.. క్లారిఫై చేసుకోవాల్సిన హక్కు ఆమెకు ఉంది. ఆమెకు మైక్ ఇవ్వలేదు సరే.. కనీసం సభను క్రమశిక్షణలో పెట్టండి. లేదా సభ నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేయాలి అంటే చెయాలి.. కానీ.. వారిని సస్పెండ్ చెయ్యరు.. మైక్ ఇవ్వరు.. ఇది కరెక్ట్ కాదు అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ స్పీకర్ సూచించారు.


Similar News