Minister: జగదీష్ మిట్టల్ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు
ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు(Padma Shri) గ్రహీత జగదీష్ మిట్టల్(Jagdish Mittal) మరణం చాలా బాధాకరమని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సంతాపం తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు(Padma Shri) గ్రహీత జగదీష్ మిట్టల్(Jagdish Mittal) మరణం చాలా బాధాకరమని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సంతాపం తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. తెలంగాణ కళలను పరిరక్షించడానికి ప్రోత్సహించడానికి జగదీష్ మిట్టల్ చేసిన కృషి అమూల్యమైనదని కొనియాడారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన “జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్” ద్వారా వారు అందించిన వారసత్వం తరతరాల కళాకారులు, కళాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ గారి మరణం చాలా బాధాకరం.
— Konda Surekha (@iamkondasurekha) January 7, 2025
మన కళలను పరిరక్షించడానికి ప్రోత్సహించడానికి జగదీష్ మిట్టల్ గారు చేసిన కృషి అమూల్యమైనది.
హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన “జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్” ద్వారా వారు అందించిన… pic.twitter.com/Q0kBOMsQkC