కవిత ఇంటి వద్ద BRS నేతల ఆందోళన.. MLC నివాసం వద్ద హై టెన్షన్..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ ఆమెను
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో కవితను ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కవిత అరెస్ట్ నేపథ్యంలో ఆమె నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. కవితకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అక్రమం అంటూ భారీగా నినాదాలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తిస్తున్నారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఎదురుకోలేక కవితను అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కవితను ఢిల్లీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read More..
MLC కవిత అరెస్ట్.. విచారణాధికారితో KTR, హరీష్ రావు వాగ్వాదం..!