కాంగ్రెస్ ప్రకటించిన 100 మంది అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపేలా ప్లాన్ చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపేలా ప్లాన్ చేస్తోంది. ఈ సారి కేసీఆర్ సర్కార్ గద్దె దించి.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కంకణం కట్టుకున్నది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో గతానికి భిన్నంగా కాంగ్రెస్ ఆచూతూచి వ్యవహరిస్తోంది. పీసీసీ, స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తు చేసిన అనంతరం అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు.
ఇక, నామినేషన్ల తేదీ దగ్గర పడుతుండటంతో విడతల వారిగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ రెండు విడతల్లో 100 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసి ప్రకటించింది. తొలి జాబితాలో 55 మంది పేర్లు ప్రకటించిన ఏఐసీసీ.. తాజాగా ఇవాళ విడుదల చేసిన సెకండ్ లిస్ట్‌లో 45 మంది పేర్లను ఎనౌన్స్ చేసింది. మరో 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, ఉమ్మడి 10 జిల్లాల వారిగా కాంగ్రెస్ ప్రకటించిన 100 అభ్యర్థుల పేర్లు కింది ఇచ్చిన జాబితాలో పొందుపర్చాం.
ఆదిలాబాద్ జిల్లా :
బెల్లంపల్లి (ఎస్సీ) : గడ్డం వినోద్
మంచిర్యాల : ప్రేమ్‌సాగర్ రావు
నిర్మల్ : శ్రీహరి రావు
బోథ్ : బాపూరావ్ రాథోడ్
ముధోల్: భోస్లే నారాయణ రావ్ పటేల్
సిర్పూర్ : రావి శ్రీనివాస్
ఆసిఫాబాద్: అజ్మీరా శ్యామ్
ఖానాపూర్ : ఎడ్మ బొజ్జు
నిజామాబాద్ జిల్లా :
ఆర్మూర్ : వినయ్ కుమార్ రెడ్డి
బోధన్ : పి. సుదర్శన్ రెడ్డి
బాల్కొండ : సునీల్ రెడ్డి
నిజామాబాద్ (గ్రామీణ): రేకులపల్లి భూపతిరెడ్డి
ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావ్
కరీంనగర్ జిల్లా :
జగిత్యాల : టి. జీవన్‌రెడ్డి
ధర్మపురి (ఎస్సీ) : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రామగుండం : ఎంఎస్ రాజ్‌ఠాకూర్
మంథని : దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
పెద్దపల్లి : సీహెచ్ విజయ రమణారావు
వేములవాడ : ఆది శ్రీనివాస్
మానకొండూర్ (ఎస్సీ) : కవ్వంపల్లి సత్యనారాయణ
చొప్పదండి : మేడిపల్లి సత్యం
హుజురాబాద్: ఒడితెల ప్రణవ్
కోరుట్ల : జువ్వాడి నర్సింగరావ్
హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ గౌడ్
మెదక్ జిల్లా:
మెదక్ : మైనంపల్లి రోహిత్
ఆంధోల్ (ఎస్సీ) : సీ. దామోదర రాజనర్సింహ
జహీరాబాద్ (ఎస్సీ) : ఏ. చంద్రశేఖర్
సంగారెడ్డి : తూర్పు జగ్గారెడ్డి
గజ్వేల్ : తూంకుంట నర్సారెడ్డి
నర్సాపూర్ : ఆవుల రాజిరెడ్డి
సిద్దిపేట : పూజల హరికృష్ణ
దుబ్బాక : చెరుకు శ్రీనివాసరెడ్డి
రంగారెడ్డి జిల్లా :
మేడ్చల్ : తోటకూర వజ్రేష్ యాదవ్
మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ : కొలన్ హన్మంతరెడ్డి
చేవెళ్ళ (ఎస్సీ) : పామెన భీమ్ భరత్
పరిగి : టి. రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ (ఎస్సీ) : గడ్డం ప్రసాద్ కుమార్
ఉప్పల్ : ఎం పరమేశ్వర రెడ్డి
తాండూర్ : బుయ్యని మనోహర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్ : మధు యాష్కీ
మహేశ్వరం : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్ : కస్తూరి నరేందర్
శేరిలింగంపల్లి : జగదీశ్వర్ గౌడ్
కూకట్‌పల్లి : బండి రమేశ్
హైదరాబాద్ జిల్లా :
ముషీరాబాద్ : అంజన్ కుమార్ యాదవ్
మలక్‌పేట్ : షేక్ అక్బర్
సనత్‌నగర్ : డాక్టర్ కోట్ నీలిమ
నాంపల్లి : మహ్మద్ ఫిరోజ్‌ఖాన్
కార్వాన్ : ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అలీ హాజ్రి
గోషామహల్ : మొగిలి సునీత
చాంద్రాయణగుట్ట : బోయ నగేష్ (నరేష్)
యాకుత్‌పుర : కె. రవిరాజు
బహదూర్‌పుర : పులిపాటి రాజేశ్ కుమార్
సికింద్రాబాద్ : ఆదం సంతోష్ కుమార్
అంబర్‌పేట్ : రోహిన్ రెడ్డి
ఖైరతాబాదు : పి.విజయారెడ్డి
జూబ్లీహిల్స్ : అజారుద్దీన్
సికింద్రాబాద్ కంటోన్మెంట్: డాక్టర్ గుమ్మడి వెన్నెల
మహబూబ్‌నగర్ జిల్లా :
కొడంగల్ : రేవంత్‌రెడ్డి
గద్వాల : సరితా తిరుపతయ్య
ఆలంపూర్ (ఎస్సీ) : సంపత్ కుమార్
నాగర్‌ర్నూల్ : కూచుకుళ్ళ రాజేశ్‌రెడ్డి
అచ్చంపేట్ : డాక్టర్ వంశీకృష్ణ
కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి
షాద్‌నగర్ : కె. శంకరయ్య
కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు
నారాయణ్ పేట్: డాక్టర్ పర్ణిక చిట్టెంరెడ్డి
మహబూబ్‌నగర్: ఎన్నం శ్రీనివాసరెడ్డి
జడ్చర్ల: అనిరుధ్ రెడ్డి
దేవరకద్ర: జి మధుసూధన్ రెడ్డి
మక్తల్: వాకిటి శ్రీహరి
వనపర్తి: జి. చిన్నారెడ్డి
నల్లగొండ జిల్లా :
నాగార్జునసాగర్ : కె. జై వీర్ రెడ్డి
హుజూర్‌నగర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోదాడ : నలమాడ పద్మావతి
నల్లగొండ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) : వేముల వీరేశం
ఆలేరు : బీర్ల ఐలయ్య
దేవరకొండ: బాలూ నాయక్
మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వరంగల్ జిల్లా :
జనగాం: కొమ్మూరి ప్రతాపరెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) : సింగారపు ఇందిర
నర్సంపేట్ : దొంతి మాధవరెడ్డి
భూపాలపల్లి : గండ్ర సత్యనారాయణ
ములుగు (ఎస్టీ) : ధనసరి అనసూయ (సీతక్క)
జనగాం : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
పరకాల : రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ వెస్ట్ : నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ ఈస్ట్ : కొండా సురేఖ
వర్థన్నపేట : కేఆర్ నాగరాజు
పాలకుర్తి: ఎం యశస్విని
మహబూబాబాద్: డాక్టర్ మురళీ నాయక్
ఖమ్మం జిల్లా :
మధిర (ఎస్సీ) : భట్టి విక్రమార్క
భద్రాచలం (ఎస్టీ) : పోడెం వీరయ్య
పినపాక: పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించని 19 సెగ్మెంట్‌లు ఇవే:
1. వైరా
2.కొత్తగూడెం
3.మిర్యాలగూడ
4.చెన్నూరు
5. చార్మినార్
6.నిజామాబాద్ అర్బన్
7.కామారెడ్డి
8. సిరిసిల్ల
9.సూర్యపేట
10.తుంగతుర్తి
11.బాన్సువాడ
12.జుక్కల్
13.పఠాన్ చెరువు
14.కరీంనగర్
15.ఇల్లందు
16.డోర్నకల్
17.సత్తుపల్లి
18.నారాయణ్ ఖేడ్
19.అశ్వారావుపేట