Maxbien Pharma : సీఎం రేవంత్ అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు! ఢిల్లీలో క్రిశాంక్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీపై బీఆర్ఎస్ పార్టీ ఈడీకి ఫిర్యాదు చేసింది.

Update: 2024-11-19 09:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అల్లుడి కంపెనీపై బీఆర్ఎస్ పార్టీ ఈడీకి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో సీఎం రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ మాక్స్‌ బెయాన్ ఫార్మా (Maxbien Pharma) కంపెనీపై న్యూఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో తాజాగా బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Krishank) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రిశాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ.. కోడంగల్ నిజయోజక వర్గంలో రైతుల భూములను తీసుకోని మాక్స్‌ బెయాన్ ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని ఆయన వెల్లడించారు.

రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే (ED) ఈడీలో విచారణలు జరుగుతున్నాయని వెల్లడించారు. వారు ఎన్నో ఫ్రాడ్స్ చేసి రుణాలు దారిమళ్లించారని, ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు, ఇతర వ్యాపారాలకు తరలించారని ఈడీ విచారణ చేసిందని తెలిపారు. అయితే, నేడు కోడంగల్‌లో ఫార్మా చుట్టూ మాక్స్‌ బెయాన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో.. ఇందులో కూడా నిధులు దారి మళ్లించినట్లు అనుమానం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ అల్లుడు మాక్స్‌ బెయాన్ ఫార్మ ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News