BREAKING: ఏపీ డిప్యూటీ CM నారాయణ స్వామిపై తెలంగాణలో కంప్లైంట్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి నారాయణ స్వామిపై

Update: 2024-01-08 14:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి నారాయణ స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగంపేట్ పీఎస్‌లో నారాయణ స్వామిపై కంప్లైంట్ ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కారణమని నారాయణ స్వామి అన్నారని మల్లు రవి ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మల్లు రవి కోరారు. కాగా, వైఎస్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరిస్తారని.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగించడం లాంఛనం అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలు కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే నారాయణ స్వామి వైఎస్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణానికి కాంగ్రెస్, సోనియా గాంధీనే కారణమని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మల్లు రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News