kalvakuntla kavitha తో సెల్ఫీ తీసుకున్న కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌ విజేత Nikhat Zareen

కామన్వెల్త్ గేమ్స్- 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్‌ను

Update: 2022-08-24 16:48 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామన్వెల్త్ గేమ్స్- 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో అభినందించారు. ఎమ్మెల్సీ కవిత తనను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారని, దాంతో సీఎం కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారని నిఖత్ గుర్తు చేసుకున్నారు. దాంతోపాటు అదనంగా రూ.2 కోట్లు మంజూరు చేయడం, నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌‌కు నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌గా నిలవడం గర్వకారణమని, ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Tags:    

Similar News