హైడ్రాకు ఐజీని పెట్టింది ఆడుకోవడానికా..? భయపెడితే భయపడను : ఏవీ రంగనాథ్ (వీడియో)
తప్పు చేసిన వాళ్లు మాత్రమే హైడ్రాకు సహకరించరు. ఏ తప్పు చేయని అధికారులు, శాఖలు హైడ్రాకు సహకరిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్ : తప్పు చేసిన వాళ్లు మాత్రమే హైడ్రాకు సహకరించరు. ఏ తప్పు చేయని అధికారులు, శాఖలు హైడ్రాకు సహకరిస్తారు. మాకు సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. తప్పు చేసి వారిని ఎవరినీ వదిలిపెట్టం. తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను వదలమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన ప్రతి కట్టడాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. సుప్రీం కోర్టు సైతం బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టవద్దని తెలిపిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఐజీ ర్యాంక్ అధికారిని కమిషనర్‌గా పెట్టింది అక్రమ నిర్మాణ దారులపై చర్యలు తీసుకునేందుకే అన్నారు. ఎవరు భయపట్టినా భయపడనని తేల్చిచెప్పారు. హైడ్రా తీసుకుంటున్న చర్యలు, విధివిధానాలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘దిశ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఏవీ రంగనాథ్ చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం..
Read more :