రిజర్వాయర్లపై సీఎం సమీక్ష సమావేశం

తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి లభ్యత మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2024-09-01 11:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి లభ్యత మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత కొద్దిరోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలే గాని రాష్ట్రం మొత్తం ఒకేసారి భారీ వర్షాలు కురవడం ఇదే మొదటి సారి. ఈ వర్షాలతో గోదావరి నది, దాని ఉపనదులు నీటిలో కళకళ లాడుతున్నాయి. ఈ నీటితో పలు రిజర్వాయర్లను నింపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కడెం ప్రాజెక్టు నీటితో ఎల్లంపల్లిని.. ఎల్లంపల్లి నీటిని నంది, గాయత్రి పంప్ హౌస్ ల నుండి మిడ్ మానేరులోకి లిఫ్ట్ చేయాలని అన్నారు. అలాగే లోయర్ మానేరు, రంగనాయక్ సాగర్లను నింపాలని తెలియ జేశారు. రంగనాయక్ సాగర్ నుండి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లోకి.. అక్కడి నుండి సింగూరు, నిజం ప్రాజెక్టు వరకు నీటిని వదలాలని పేర్కొన్నారు. ఆయా జలాశయాల కింద ఉన్న చెరువులను కూడా నీటితో నింపాలని అధికారులకు సీఎం సూచించారు. కాగా ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 18 టీఎంసీల నీరు ఉంది. రోజుకు 1 టీఎంసీ నీరు మాత్రమే ఎత్తిపోయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 


Similar News