Big Breaking:గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పై సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-19 14:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నేడు(శనివారం) హైదరాబాద్‌లో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘పరీక్షలకు సిద్ధం అవ్వండి. 95 శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరో 5 శాతం మంది డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేం వచ్చాకే వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం’ అన్నారు.

ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. కాలయాపనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 ఇచ్చాం.. 53 పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్‌కు 31 వేల మందిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేశాం. ప్రిలిమ్స్ పరీక్ష అయ్యాక విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక మధ్యంతరంగా మారిస్తే కోర్టులు ఊరుకుంటాయా.. అలా మారిస్తే కోర్టులు రద్దు చేస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News