Breaking News : చేరికలపై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో చేరికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-22 10:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీలో చేరికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. త్వరలోనే తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని, ఎంతమంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని మహేష్ కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్(KTR) కు అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా తమతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబి పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించిన హైకోర్ట్.. ఆయా ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జ్ ధర్మాసనం జారీ చేసిన ఈ తీర్పుపై సమీక్షించాలని అసెంబ్లీ సెక్రెటరీ హైకోర్ట్ ప్రత్యేక బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్ట్.. స్పీకర్ ఎప్పుడైనా చర్యలు తీసుకోవచ్చని, టైమ్ బాండ్ పెట్టే అధికారం ఎవరికీ లేదని తీర్పునిచ్చింది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో మరింత మంది బీఆర్ఎస్ కీలక నేతలు చేరబోతున్నట్టు చేసిన సంచలన ప్రకటన.. రాష్ట్ర రాజకీయాల్లో దూమరాన్ని రేపనున్నట్టు తెలుస్తోంది.   

Tags:    

Similar News