ఆ గుణమే విజయాలిస్తోంది.. రెబల్ స్టార్ ప్రభాస్‌పై CM రేవంత్ ప్రశంసల వర్షం

కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయం సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-08-18 14:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయం సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరు అని కొనియాడారు. తెలుగు సినిమా ఖ్యాతిని రెబల్ స్టార్ ప్రభాస్ విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల పాత్ర కూడా ఉందని అన్నారు. ఫోర్త్ సిటీలో కూడా రాజులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనుక బోసురాజు చాలా కీలకమైన పాత్ర పోషించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాం.. దానికి కో-చైర్మన్‌గా బోసురాజును నియమించామని గుర్తుచేశారు. సిటీలో క్షత్రియ భవన్‌కు కావాల్సిన భూమి, అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News