Revanth Reddy : కొమురం భీమ్‌, వాల్మీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.

Update: 2024-10-17 08:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జల్ జంగల్ జమీన్ నినాదంతో రాచరికం, దొరతనంపై పోరాడుతూ ఆదివాసీ గోండుల వీరత్వాన్ని చాటి ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన విప్లవవీరుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా సంస్కృత ఆదికవి, రామాయణ మహాకావ్య రచయిత మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రామాయణాన్ని మహా కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నతలు మహర్షి వాల్మీకి అని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారిక సాంస్కృతిక కార్యక్రమంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కొమురం భీమ్, వాల్మీకి చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులు ఉన్నారు.


Similar News