మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన

మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గురువారం అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

Update: 2024-10-17 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: మూసీ సుందరీకరణ ప్రణాళిక(Mousse beautification plan)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గురువారం అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయి. పది నెలలుగా అధికారులు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ధేశించే ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను అడ్డుకునే, వ్యతిరేకించే వాళ్లు అడుగడుగునా ఉంటారు. వారిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేం అని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివిసించే వారి వివరాలు సేకరించాం. దుర్భర స్థితిలో ఉన్నవారికి మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెళ్తోందని తెలిపారు.

ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాము నిద్రాహారాలు మాని పనిచేసేది అద్దాల కోసం కాదు.. అందాల భామల కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసమని వెల్లడించారు. నాలుగు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం కలే అవుతుందని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. దుబాయ్ వెళ్లి జుట్టుకు నాట్లు వేయించుకునే వాళ్ల కోసం కాదు మూసీ సుందరీకరణ అని కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. బందిపోటు దొంగళ్లా పదేళ్లు రాష్ట్రాన్ని పీడించి దోచుకున్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన అవినీతి మొత్తం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాము మూసీకి జీవం పోస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కళ్లమంటతోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించడానికి తాను సిద్ధమని.. గజ్వేల్ అయినా వస్తా, వేములవాడకైనా వస్తా, కిష్టాపూర్‌కు అయినా వస్తా.. అంతేకాదు.. సెక్యూరిటీ లేకుండా వస్తా.. సిద్ధమా? అని బీఆర్ఎస్‌ నేతలకు సవాల్ చేశారు. మూసీ మొత్తం 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సర్వమతాలకు ప్రతీక మూసీ నది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Similar News