CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన
కేబినెట్ విస్తరణ(Cabinet Expansion)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్ విస్తరణ(Cabinet Expansion)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. నాకు ఏఐసీసీతో గ్యాప్ లేదు. కాంగ్రెస్ శ్రేణులను కన్‌ఫ్యూజ్ చేయడానికే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్(CM Revanth Reddy) మండిపడ్డారు. తెలంగాణలో ఏఐసీసీ(AICC) అంటే తానే అని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. జన్వాడ ఫామ్‌హౌజ్‌పై కట్టుకథలు అల్లడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse)లో సారాయిబుడ్లు బయటకొచ్చాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి అంటే ఎవరైన క్రాకర్స్ కాలుస్తారు. కానీ, కేటీఆర్ అనధికార విదేశీ మద్యంతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
రాజకీయాల్లో నా స్టైల్ నాది.. కేటీఆర్(KTR) స్టైల్ కేటీఆర్‌ది. సినిమాల్లో కూడా రాజమౌళిది ఒక స్టైల్.. రామ్ గోపాల్ వర్మది మరొక స్టైల్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో కేసీఆర్(KCR) పనిఅయిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం మూసీని అభివృద్ధి చేసీ తీరుతామని అన్నారు. అవసరమైతే సమయం వచ్చినప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తా అని సంచలన ప్రకటన చేశారు. అక్రమ సొమ్ముతో బీఆర్ఎస్ సోషల్ మీడియాను కొనుగోలు చేస్తోంది. ఆ సోషల్ మీడియాతో ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. ఎంతో ఆలోచించే హైడ్రాను రంగంలోకి దింపా. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని మాట్లాడటం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో దేశ వ్యాప్తంగా స్తబ్ధత వచ్చిందని అన్నారు.