CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ(DeepaDas Munshi) సమావేశం అయ్యారు.

Update: 2024-11-20 15:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ(DeepaDas Munshi) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తోపాటు, మంత్రి ఉత్తమ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ అత్యవసర సమావేశానికి గల కారణం... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది కావస్తున్న తరుణంలో మిగిలిన నామిటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని పార్టీ చర్చించినట్లుగా సమాచారం. వరుసగా ఎన్నికలు రావడంతో గత కొంత కాలంగా నామినెటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. హర్యానా, జమ్ము కశ్మీర్, ఆ తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో నామినెటెడ్ పోస్టుల భర్తీ అంశంపై దృష్టి పెట్టలేదు. గతంలో మొదటి విడతలో 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఆ తరువాత ఒకటి రెండు మినహా మిగిలిన పోస్టులను భర్తీ చేయలేదు. అయితే జిల్లా స్థాయికి సంబంధించిన జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీల నియామకాలు జరిగాయి. దేవాలయ కమిటీలను భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటిలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి యేడాది కావస్తున్నందున విజయోత్సవాలు, నామినెటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలు చర్చించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో సామాజిక వర్గాలు, జిల్లాల వారిగా సమప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు భర్తీకాగా మరికొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ముఖ్య పదవుల్లో ఆర్టీసీ ఛైర్మన్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలుగా ఉన్న యాదగిరి గుట్ట, భద్రాచలం తదితర కీలక దేవాలయాల కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయితే పదవులు ఎవ్వరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే.


👉 Also Read: BRS: రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థుల ప్రాణాలు.. మాజీ మంత్రి హరీష్ రావు 

Tags:    

Similar News