Comprehensive Family Survey : 55.6 శాతం పూర్తయిన సమగ్ర కుటుంబ సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది.

Update: 2024-11-20 17:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది. బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తి అయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,16,14,349 నివాసాలు ఉండగా.. ఇందులో నేటి వరకు 90,56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78 శాతం లక్ష్యం పూర్తిచేశారు. నేటి వరకు రాష్ట్రంలో ములుగు జిల్లా అత్యధికంగా 97,552 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా లక్ష్యంని మించి 98,080 నివాసాలను సర్వేచేసి 100.5 శాతం సాదించి మొదటి స్థానంలో నిలిచింది. జనగాం జిల్లా 99.9 శాతం పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచింది. నల్లగొండ 97.7 శాతంతో తృతీయ స్థానంలో వుంది. అదేవింధగా కామరెడ్డి 93.3 శాతం, మంచిర్యాల 93.2 శాతం, యాదాద్రి భువనగిరి 92.3 శాతం, నిజామబాద్ 91 శాతం, రాజన్న సిరిసిల్ల 90.9 శాతం, జగిత్యాల 90.6 శాతం, మిగతా 9 జిల్లాలో కూడా 90 శాతం పైగా సర్వేపూర్తి అయింది.

జిహెచ్ఎంసీ పరిధి లో కూడ సర్వే ప్రక్రియ ఊపు అందుకుంది. జిహెచ్ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి వుండగా నేటి వరకు 13,91,817 నివాసాలలో సర్వే పూర్తిచేసి, 55.6 శాతం సాధించింది. ఈ సర్వేకు ప్రజల నుండి మంచి స్పందన ఉందని అధికారులు వివరించారు. 52,493 గ్రామీణ, 40,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 92,901 బ్లాకులుగా విభజించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోంది. ఈ సర్వే సకాలం లో పూర్తిచేసే విధంగా జిల్లా ఇన్చార్జ్ అధికారులు కలెక్టర్లు ఎప్పటిప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకుటున్నారు.  

Tags:    

Similar News