KTR: చిట్టి నాయుడికి ధైర్యం సరిపోవట్లేదా..? మాజీమంత్రి కేటీఆర్ సెటైర్లు
రేవంత్ రెడ్డి(M Revanth Reddy).. మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేదా ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working Presindent KTR) ప్రశ్నించారు.
దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(M Revanth Reddy).. మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేదా ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working Presindent KTR) ప్రశ్నించారు. లగచర్ల ఘటన(Lagacharla Incident)తో పాటు రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ లీడర్లు ఏర్పాట్లు కూడా చేశారు.
కేటీఆర్ ఈ ధర్నా కార్యక్రమానికి హాజరై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ధర్నాకు అనుమతి(Permission) నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వేములవాడ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నిమిషానికి నలభైసార్లు కేసీఆర్(KCR) రావాలి అని తెగ ఒర్లుతున్నావని సంచలన వ్యాఖ్యలు చేశారు. "అసెంబ్లీ(Assembly)లో కేసీఆర్ ముందు నుంచునే మాట దేవుడెరుగు.. కనీసం మహబూబాబాద్ లో మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?!" అని కేటీఆర్ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.