రూ.2 లక్షల రుణమాఫీ ఎఫెక్ట్.. మరో దేవతపై ఒట్టేసిన సీఎం రేవంత్..!

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో నిర్వహించిన ప్రెస్

Update: 2024-04-27 12:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి చెబుతున్నా.. ఆగస్ట్ 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పెంచుకుని రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని ఈటల రాజేందర్ సలహా ఇస్తున్నారని.. మరీ కేసీఆర్, కేటీఆర్‌లకు ఎందుకు ఈ విధంగా చెప్పలేదని ప్రశ్నించారు. 2014లో రూ. లక్ష రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ 2019 వరకు పూర్తి చేయలేదని.. 2019లో మరోసారి రూ. లక్ష రుణమాఫీ చేస్తానని 2023 వరకు కంప్లీట్ చేయలేదని మండిపడ్డారు. కానీ మేం కేసీఆర్ వలే మాట తప్పేది లేదని.. ఆగస్ట్ నాటికి రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు.

అయితే, పార్లమెంట్ ఎన్నికల వేళ స్టేట్ పాలిటిక్స్‌లో రైతు రుణమాఫీ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లిన అక్కడి ప్రముఖ దేవుళ్లపై ఒట్టేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపైన రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ జరుగుతున్నప్పుడు ఈ కేసుపై మాట్లాడటం భావ్యం కాదని అన్నారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి అయ్యాక అప్పుడు మాట్లాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం హోంశాఖ తనవద్దే ఉన్నందున బాధ్యతాయుతంగా ఉంటానని పేర్కొన్నారు.  

Read More...

కేసీఆర్ మానసిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సెటైర్ 

Tags:    

Similar News