CM Revanth: ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మంచి పరిపాలన అందించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని(Rajiv Yuva Vikasam Scheme) సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులతో కలిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉన్నామని అన్నారు. కులగణన చేశాం.. ఆర్టీసీ(RTC)ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ(RunaMafi) చేశాం.. రైతు భరోసా ఇచ్చాం.. 50 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశాం.. 200 యూనిట్ల ఫ్రీకరెంట్ ఇస్తున్నాం.. ఇలా చెప్పుకుంటూపోతే ఏడాదిన్నరలోనే ఎంతో చేశామని అన్నారు.
తాజాగా నిరుద్యోగులు(Telangana Unemployed) వారి సొంత కాళ్ల మీద వారే నిల్చునేలా ఆర్థిక భరోసా కల్పించడానికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ఈ పథకం(Rajiv Yuva Vikasam Scheme) ద్వారా ఒక్కో నిరుద్యోగికి రూ.4లక్షల వరకు రుణాలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఈ రుణంలో 60 నుంచి 80 శాతం మాఫీ అవుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల సహాకారంతో ఈ స్కీమ్‌ను అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ ఐదో తేదీ లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిరుద్యోగులకు సూచించారు.