దావత్‌కు కూడా హెలికాప్టర్‌లో వెళ్తున్నారు.. మంత్రులపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-24 06:18 GMT
దావత్‌కు కూడా హెలికాప్టర్‌లో వెళ్తున్నారు.. మంత్రులపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తన సస్పెన్షన్‌పై ఇప్పటివరకు బులిటెన్(Bulletin) ఇవ్వలేదని.. బులిటెన్ ఇవ్వకుండా సభకు రావొద్దు అనడం ఏంటని ప్రశ్నించారు. అఫీషియల్‌గా బులిటెన్ ఇస్తే రాను అని అన్నారు. అసలు ఏ కారణంతో తనను సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ పద్దతి లేదు.. పాడు లేదు.. అసెంబ్లీ(Telangana Assembly) ఇష్టారాజ్యంగా నడుస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తోందని అన్నారు.

‘నన్ను సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు. మందబలంతో సభ నడుపుతాం అంటే కుదరదు’ అని వార్నింగ్ ఇచ్చారు. ముందు తన సస్పెన్షన్‌(Suspension)పై బులిటెన్ ఇవ్వాలి.. లేదంటే స్పీకర్‌నే నేరుగా కలుస్తాను అని అన్నారు. బులిటెన్ ఇస్తే నేను కోర్టుకు వెళతా అనే భయంతోనే.. ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. సస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.. కానీ వారం గడిచినా ఇంకా ఇవ్వడం లేదు.. ఎందుకు సస్పెండ్ చేశారో ఆధారాలు లేకనే బులిటెన్ ఇవ్వడం లేదని విమర్శించారు.

అంతేకాదు.. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలపై కూడా జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ‘గంట ప్రయాణానికి కూడా మా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు హెలికాప్టర్‌(Helicopter)లో వెళ్తున్నారు. నిన్న జాన్ పహడ్‌లో జానారెడ్డి(Jana Reddy) దావత్‌కు కూడా హెలికాప్టర్‌లో వచ్చారు’ అని కీలక ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News