మందకృష్ణ నా కంటే ఎక్కువ వాళ్లనే నమ్ముతుండు.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga)తో విభేదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టత ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga)తో విభేదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టత ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవు.. మా ఇద్దరి మధ్య వ్యక్తిగత అనుబంధం బాగుందని అన్నారు. కానీ.. ఒక విషయంలో బాధగా ఉంది.. నా కంటే ఎక్కువ ప్రధాని మోడీ(PM Modi)ని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)నే మందకృష్ణ ఎక్కువగా నమ్ముతున్నారు అని అన్నారు. దేశంలో బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం లేదు.. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ(Congress Govt) అని చెప్పారు. పక్కా ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నాం.. వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చే వరకు ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వొద్దని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
‘రాహుల్ గాంధీ(Rahul Gandhi) లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదు. భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాం. వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చింది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేసింది కాదు. వర్గీకరణ( SC Classification) ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘ముఖ్యమంత్రి కుర్చీలో నేను మీ వాడిగా కూర్చున్నాను. మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’ అని సూచించారు.
Also Read..
Gummadi Narsaiah : కేసీఆర్ నియంత... రేవంత్ ప్రజల మనిషి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య