Viral Video : బ్యాడ్మింటన్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్

రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Update: 2024-09-11 12:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యాట్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ కార్య‌క్ర‌మంలో డీజీపీ జితేంద‌ర్‌తో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. కాగా, గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌సీయూ విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ గేమ్ ఆడిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలో క్రీడలను ప్రొత్సహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో క్రీడల విశ్వ వేదికగా తెలంగాణ హైదరాబాద్ మారుతుందని, ఆ దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఇటీవల ఎక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ షేర్ రెడ్డి చేశారు.


Similar News