CM Revanth Reddy: భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష.. మంత్రులతో టెలికాన్ఫరెన్స్

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు.

Update: 2024-09-01 06:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులతో టెలికాన్షరెన్సన్ ద్వారా మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మలతో ఫోన్లో మట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయితీరాజ్, ఇరిగేషన్, హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అధికారులు సెలవులు రద్దు చేసుకోవాలని తెలిపారు. వరద ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరదలు, సహాయక చర్యల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.


Similar News