బీటెక్ విద్యార్థులు గంజాయి సేవిస్తూ డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్నారు.. ఇది చాలా ప్రమాదకరం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్కమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం జేఎన్ఎఫ్ఏయూలో బీఎఫ్ఎస్ఐ (బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

Update: 2024-09-25 11:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్కమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం జేఎన్ఎఫ్ఏయూలో బీఎఫ్ఎస్ఐ (బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 50-60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పటికిప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదని.. ఇటీవల కాలంలో బీటెక్ విద్యార్థులు గంజాయి సేవించడంతో పాటు అమ్ముతున్నారని, విద్యార్థులు డ్రగ్‌పెడ్లర్లుగా మారుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరమని, డ్రగ్స్ వల్ల తెలంగాణ యువత నిర్వీర్యం అవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పంజాబ్ రాష్ట్రం ప్రస్తుతం పతనం దిశగా ముందుకు వెళ్తుందని.. మన రాష్ట్రాన్ని అలాగే వదిలేద్దామా.. అని యువతని సీఎం ప్రశ్నించారు.

యువతపై అత్యంత ప్రభావం చూపుతున్న డ్రగ్స్‌పై పోరాటంలో యువతే ముందుండాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. సరైన మార్గంలో నడుస్తారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ మధ్య కాలంలో బీటెక్ విద్యార్థులకు బేసిక్‌ నాలెడ్జ్ ఉండటం లేదని, కాలేజీల్లో సరైన బోధన లేకపోవడమే ఇందుకు కారణం అని.. ఇది మంచి పద్ధతి కాదని ఇంజినీరింగ్ కాలేజీలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పద్ధతి మార్చుకొకుండా ఇంజినీరింగ్ కాలేజీలు ఇలానే కొనసాగితే అనుమతులు రద్దు చేస్తామని సీఎం రేవంత్ జేఎన్ఎఫ్ఏయూలో బీఎఫ్ఎస్ఐ ప్రోగ్రామ్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.

For video : https://x.com/TelanganaCMO/status/1838844959664771403


Similar News