Ganesh Chaturthi : గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

సెప్టెంబర్ 7 నుండి మొదలవనున్న గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-08-29 13:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ 7 నుండి మొదలవనున్న గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుందని, ఉత్సవాల్లో పాల్గొనే నగర పౌరులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది హుస్సేన్ సాగర్లో విగ్రహాలను నిమజ్జనం చేయరాదంటూ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేయగా.. అదే విధానాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని అన్నారు. మొత్తం నగరాన్ని కొన్ని ప్రధాన భాగాలుగా విడదీసి, ఆయా ప్రాంతాల్లో మాత్రమే విగ్రహ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలని తెలియ జేశారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు పోలీసులతో రక్షణ ఏర్పాట్లు చేయాలని డీజీపీకి సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, సీతక్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహలతో పాటు.. సీఎస్ శాంతికుమారి, డీజీపీ, జీహెచ్ఎంసీ మేయర్, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News

టైగర్స్ @ 42..