వాటి ఏర్పాటు తర్వాతే సర్పంచ్ ఎన్నికలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం మగిసి దాదాపు ఏడు నెలలు కావొస్తుంది.

Update: 2024-08-29 06:37 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం మగిసి దాదాపు ఏడు నెలలు కావొస్తుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. అయితే గ్రామ పంచాయతీలకు 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల నిర్వహించలేదు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ఇదిలా ఉంటే గ్రామపంచాయితీల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో బీసీ కమిషన్, చైర్మన్, సభ్యులను నియమించిన తర్వాత వాటి ద్వారా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తామని.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఆరు రోజుల క్రితం జారీ చేసిందని.. దీని ఆధారంగా త్వరలో జరగబోయే ఎన్నికలకు ఓటర్ల జాబితాను తయారు చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు.


Similar News