CM Revanth Reddy : ఉక్కు మనిషి పటేల్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
భారత దేశ తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel)వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు నివాళులర్పించారు.
దిశ, వెబ్ డెస్క్ : భారత దేశ తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel)వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు నివాళులర్పించారు. పటేల్ కు నివాళులు అర్పించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు ఉన్నారు. దేశ సమగ్రత, సమైక్యతకు సర్ధార్ పటేల్ చేసిన కృషిని వారంతా స్మరించుకున్నారు.