రాంచరణ్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి

కాలిఫోర్నియా టూర్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాంచరణ్ తో సమావేశం అయ్యారు.

Update: 2024-08-10 16:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాలిఫోర్నియా టూర్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాంచరణ్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రాంచరణ్ ను కలవడం ఏంటని అనుకుంటున్నారా..? ఈయన యాక్టర్ రాంచరణ్ కాదు. కాలిఫోర్నియాలోని ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ రాంచరణ్. ప్రపంచంలోని టాప్ కంపెనీల సిఈఓలు, బోర్డులతో పనిచేసిన40 ఏళ్ల సుధీర్ఘ అనుభవం కలిగిన రాంచరణ్ సలహాలు, సూచనలు రాష్ట్ర అభివృద్దికి ఎంతో అవసరం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో కీలక వ్యాపార ఇన్ఫ్లూయెన్సర్ అయిన రాంచరణ్ గారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాపారం, ధోరణులు అమలు చేయడానికి అనేక ఆసక్తికరమైన ఆలోచనలు అందించారని అన్నారు. త్వరలోనే హైదరాబాద్ వచ్చి, రాష్ట్ర అభివృద్దిలో పాలు పంచుకోవాలని కోరామని, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సీఎం తెలిపారు. 


Similar News