ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంగళవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు.

Update: 2023-12-19 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంగళవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. కేబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల అంశంపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నారు. అంతేగాక.. లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో.. పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్‌ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోం శాఖ, విద్యాశాఖతో పాటు పలు కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు డజను మందికిపైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఆరు బెర్తులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News