CM Revanth Reddy: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్‌రెడ్డి.. కేబినెట్ విస్తరణపై నేడు కీలక ప్రకటన!

కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదువులే అజెండాగా సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.

Update: 2024-08-23 06:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదువులే అజెండాగా సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. అదేవిధంగా బిజీ షెడ్యూల్ కారణంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. మరికొద్దిసేట్లోనే వారంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా‌గాంధీ నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే మీటింగ్‌లో సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. కొత్త పీసీసీ చీఫ్ పదవి, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఎవరికి కేటాయించాలనే విషయంపై ఇవాళే తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, నామినేటెడ్ పదువుల విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధినాయకత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారికి మొదటి ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచనలో ఉంది. ఆనాడు వారికిచ్చి హామీని నెరవేర్చని పక్షంలో వాళ్లంతా పార్టీని వీడే అవకాశం ఉండటంతో తొలి ప్రధాన్యతగా వాళ్లకే పదువులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చాలామంది నేతలు సీఎం, మంత్రుల స్థాయిలో లాబీయింగ్‌లు కూడా మొదలు పెట్టారు. ఇక పీసీసీ చీఫ్ రేసులో చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మధుయాష్కీ, సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ తెరపైకి వచ్చాయి. ఇక కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీలు ఉండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు తమ వారికి ఇప్పించేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రయాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం‌కు మంత్రి పదవి దక్కే చాన్స్ ఉందని.. అది కూడా విద్యా శాఖ అంటూ జోరుగా ప్రచారం జరగుతోంది. 

Tags:    

Similar News