CM Revanth Reddy : రైజింగ్ తెలంగాణ సాధనలో భాగస్వామ్యలవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ(Telangana)ను సస్యశ్యామలం చేసేందుకు.. తెలంగాణ రైజింగ్(Telangana Rising)సాధించేందుకు ప్రజాపాలన చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)ను సస్యశ్యామలం చేసేందుకు.. తెలంగాణ రైజింగ్(Telangana Rising)సాధించేందుకు ప్రజాపాలన చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. తన ప్రభుత్వం ఒక సంవత్సరంలో రూ.52,118 కోట్ల రుణాలను సేకరించి, రూ.64,516 కోట్ల బీఆర్ఎస్ రుణాన్ని క్లియర్ చేసిందన్న వార్త కథనాన్ని రేవంత్ రెడ్డి తన ట్వీట్ కు జోడించారు. గత పాలకుల నుంచి రూ.7,00,000 కోట్లకు పైగా అప్పుల భారంతో రాష్ట్ర పాలనను చేపట్టామని గుర్తు చేశారు. సాకులు చెప్పడానికి బదులుగా, మేము రుణాలు, కేటాయింపులు, రాబడి మెరుగుదలలు, చెల్లింపుల నిర్వహణపై కఠినమైన వాస్తవిక వాదంతో మా ఆర్థిక ప్రణాళికను అమలు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే క్లిష్టమైన పనిని ప్రారంభించామని తెలిపారు.
రైతులు, మహిళలు, పాఠశాల విద్యార్థులు, నిరుద్యోగ యువత సహా అన్ని వర్గాల ప్రజల, అన్ని రంగాల అభివృద్ధి, ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా సంక్షేమ వాగ్దానాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బలమైన అభివృద్ధి దృక్పథాన్ని నిర్మించడం ద్వారా మేము గొప్ప ఫలితాలను అందించామని తెలిపారు. తెలంగాణను సస్యశ్యామలంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లడం సుదూరంగా ఉన్నప్పటికి తెలంగాణ రైజింగ్ సాధించేందుకు ప్రజాపాలన చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతి పౌరుడిని పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నానని రేవంత్ రెడ్డి కోరారు. ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సాధించిన ప్రగతి పట్ల నా కేబినెట్ సహచరులను, ఎమ్మెల్యేలను, నాయకులను, అధికారులను, ప్రభుత్వ సిబ్బందిని అందరినీ నేను అభినందిస్తున్నానని తెలిపారు.