రిజర్వేషన్ల రద్దుపై CM రేవంత్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్

దేశంలో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ‌ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన

Update: 2024-05-01 12:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ‌ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేంద్రం చేస్తున్న దాడులను అందరూ చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల గురించే నేను మాట్లాడుతున్నా. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలను అమలు చేయడమే బీజేపీ అజెండా.

రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరగకుండా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తోందని చెప్పినందుకే నాపై అక్రమ కేసులు పెట్టారు. గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. వాయిపేజ్ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రసంగం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆనాడు రాష్ట్రపతి ప్రసంగం సారాంశంలో రిజర్వేషన్లు రద్దు గురించి ఉంది. రిజర్వేషన్ల రద్దు గురించి ఆధారాతో సహ నేను వాదిస్తున్నా. నా వాదనలపై సరైన వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మోడీ, అమిత్ షాకు ఉంది.

నేను సూటిగా ప్రధాని మోడీ, అమిత్ షాను ప్రశ్నిస్తున్నా. మూడింట రెండొంతులు మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు. 2000లో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఓ గెజిట్ ఇచ్చారు. రాజ్యాంగంపై సమీక్షించాలని ఈ గెజిట్ ఉద్దేశం. రాజ్యాంగాన్ని మార్చడానికి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను వేశారు. 2002లో వెంకటాచలయ్య కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలో వెంకటాచలయ్య కమిషన్ ఆ నివేదికలో పేర్కొంది. 2002లో ఇచ్చిన నివేదిక అందుబాటులో లేకుండా పోయింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం బీజేపీకి లేకుండా పోయింది.

పదేళ్ల తర్వాత దేశంలో రిజర్వేషన్లు తొలగించాలని 2015లో ఆర్ఎస్ఎస్ రెండో సర్‌సంఘ్ చాలక్ గోల్వాల్కర్ సూచించారు. గోల్కాల్కర్ చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది కావున.. ఇప్పుడు రిజర్వేషన్ల రద్దుకు యత్నిస్తున్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లు సరికాదని 2015లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎన్‌జీ వైద్య పత్రికల్లో వ్యాసాలు రాశారు. బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులను వాడుకుంటోంది. బీజేపీ కుట్రను తిప్పికొట్టడానికి నేను కచ్చితంగా పోరాడుతా. వాళ్ల ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తానులు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More...

మోడీ బీసీ కాదు.. ప్రధాని క్యాస్ట్‌పై CM రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్ 

Tags:    

Similar News