రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ మొహరం శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనీరతికి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీక

Update: 2024-07-16 16:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనీరతికి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీక అన్నారు. గంగా, జమునా, తెహజీబ్‌కు గొప్ప నిదర్శనం పీర్ల ఊరేగింపని కొనియాడారు. గ్రామాల్లో హిందూ ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు చేస్తారని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా ప్రజల మధ్య సఖ్యతకు మొహరం పండుగ వారధి అని అన్నారు.


Similar News