ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలపై CM రేవంత్ కీలక ఆదేశాలు

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షన్ పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు.

Update: 2024-07-19 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షన్ పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌పై ఆర్కిటెక్ట్స్‌తో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అయితే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ పాఠశాలల ఏర్పాటును పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం చేపట్టింది. మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పటిష్టపరిచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలన్నారు. అంగన్వాడీ ప్లే స్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్వాడీలో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలన్నారు. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలన్నారు. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ, సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు వసతులు కల్పించాలన్నారు. మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  

Tags:    

Similar News