మోడీకి ప్రధానమంత్రి పదవి ఇచ్చింది నన్ను జైల్లో వేయడానికేనా..? CM రేవంత్ ఫైర్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం పెద్ద చర్చకు దారితీసింది.

Update: 2024-05-01 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన అహ్మదాబాద్ పోలీసులు నకిలీ వీడియోను షేర్ చేశారనే ఆరోపణల మీద ఒక కాంగ్రెస్ నేత కీలక అనుచరుడితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన కార్యకర్తను అహ్మబాబాద్ సైబర్ క్రైమ్ సెల్ అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఇష్య్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా లాగిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు కూడా పంపారు.

దీంతో సీఎం కావాలనే నాపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని అమిత్ షాపై మండిపడ్డారు. ఐఎన్‌సీ తెలంగాణ ట్విట్టర్ (@INCT Telangana) ఖాతాను తాను నిర్వహించడం లేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ సమాధానం చెప్పారు. తాను సీఎంవో తెలంగాణ, తన వ్యక్తిగత ఖాతా మాత్రమే వినియోగిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి పదవి ఇచ్చింది నన్ను జైల్లో వేయడానికేనా..? ఇదా మీరు నేర్చుకున్నది..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More...

తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన 

Tags:    

Similar News